పెరుగు, చక్కెర కలిపి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు కలిపి తింటే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాదు ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ రెండు కలిపి తింటే ఆ పని విజయవంతం అవుతుందని పెద్దలు చెబుతుంటారు.