KNR: సైదాపూర్ మండలం రామచంద్రాపూర్, కురుమ పల్లె గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు సమయంలో రెండు గ్రామాల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు.