WGL: పట్టణంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూటర్ సైన్స్, ఐటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీసీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులని అధికారులు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు nitw.ac.in వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.