ATP: గుత్తి ఆర్ఎస్లో నివాసముండే విజయలక్ష్మి అనే మహిళ అదృశ్యమైంది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజయలక్ష్మి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. గురువారం విజయలక్ష్మి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.