GDWL: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు డి. రమేష్ డిమాండ్ చేశారు. గురువారం గట్టు మండలంలో సభ్యత్వ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా ఆలస్యం చేయడం సరైనది కాదన్నారు.