AP: అమరావతిలోని శ్రీవారి ఆలయాన్ని తిరుమల మాదిరి తీర్చిదిద్దుతున్నామని, రెండున్నరేళ్లలో ఆలయం ప్రారంభిస్తామని CM చంద్రబాబు తెలిపారు. వెంకటపాలెంలో ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ అనంతరం.. దేవతల రాజధానిలా ఏపీ అమరావతి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వెంకటేశ్వరుడి సన్నిధిని అపవిత్రం చెయ్యనివ్వనని, శ్రీవారి దర్శనానికి సామన్యుడిలాగే వెళ్తానని పేర్కొన్నారు.