RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణదేవరాయనగర్, వైదేహినగర్ నార్త్, అనంతవేణినగర్ కాలనీలలో ఓపెన్ జిమ్ పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం సభ్యుల విజ్ఞప్తి మేరకు డివిజన్ BRS అధ్యక్షులు అరవింద్ రెడ్డి పరికరాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించిన నిధులతో పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.