CTR: సదుంలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ఆవరణలో స్వామివారి ముప్పై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సభ్యుల ఆధ్వర్యంలో గురువారం భూమి పూజ నిర్వహించారు. దాతల సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.