NRML: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాకు పరిశీలకులుగా ఆయేషా మస్రత్ ఖాన్ను నియమించబడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమెను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ఉదయం అటవీ శాఖ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్, అబ్జర్వర్కు పూల మొక్కను అందించారు. అనంతరం ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు చర్చించారు.