అకస్మాత్తుగా బరువు తగ్గటం, ఉన్నట్టుండి జుట్టు ఎక్కువగా రాలడం, మూత్రం, మలంలో రక్తం పడటం, తరుచూ కడుపుబ్బరం, పొట్ట నొప్పి రావడం వంటివి జరిగితే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. అలాగే మహిళల్లో వెజైనల్ డిశ్చార్ తెలుపు రంగు కాకుండా వేరే రంగులో దుర్వాసనతో రావడం, నెలసరి సమయంలో రక్తం గడ్డలాగా పడితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.