NLG: గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అయితే పురుషులతో పోలిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లు 29 వేలపై చిలుకు అధికంగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే గెలుపు ఖాయమని భావిస్తున్నారు.