AP: తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్తీ నెయ్యిపై మీడియాకు వివరణ విచ్చిన ఆయన.. తన హయాంలో సంస్కరణలే తప్ప ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని పేర్కొన్నారు. ప్రసాదంలో వెజిటెబుల్ ఫ్యాట్ కలిసిందని TTD EO, జంతువుల కొవ్వు అని చంద్రబాబు అంటున్నారని.. నిజానికి ఏం కలిసిందో ఇప్పటికీ తెలియదన్నారు.