TG: ప్రజా భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు అఖిలపక్ష ఎంపీల కీలక సమావేశం జరగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ భేటీ నిర్వహిస్తున్నారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న రాష్ట్ర సమస్యలు, నిధుల విడుదలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగనుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఎంపీలు ఎలా గళం విప్పాలనే దానిపై వ్యూహరచన చేయనున్నారు.