VZM: బొబ్బిలి MPDO పి.రవికుమార్ ఇవాళ స్థానిక గొర్లె సీతారాంపురంలో పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తను బయట వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. తాగునీరు వృధా చేయకుండా పొదుపుగా వాడాలన్నారు. ఆయనతో డిప్యూటీ MPDO అల్లు భాస్కరరావు ఉన్నారు.