ATP: ఎంపీ సీఎం రమేష్ మాతృమూర్తి చింతకుంట రత్నమ్మ కడప జిల్లా యర్రగుంట మండలం పొట్లదుర్తిలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు పొట్లదుర్తి వెళ్లి వారి మాతృమూర్తి భౌతికకాయానికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.