TG: 2019 గ్రూప్-2 ర్యాంకర్లకు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును.. తాజాగా డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. దీంతో ఎంపికైన అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. తదుపరి విచారణను కోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. తాజా తీర్పుతో నియామక ప్రక్రియపై సందిగ్ధత కొంతమేర తొలగినట్లయింది.