AP: రాజధాని ప్రాంతం వెంకటపాలెంలోని వెంకటేశ్వర ఆలయ విస్తరణ పనులకు CM చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ మేరకు రూ.260 కోట్లతో 2 దశల్లో ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, మండపాలు, ఆంజనేయ స్వామి ఆలయం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం, TTD ఛైర్మన్ BR నాయుడు తదితరులు పాల్గొన్నారు.