TPT: శ్రీకాళహస్తి (M) పుల్లారెడ్డికండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. YCP మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున దుండగులు కత్తులతో మధుసూదన్ తల్లిదండ్రులపై దాడి చేసినట్లు సమాచారం. ఆయన తల్లి జయమ్మ స్పాట్లో చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.