SRPT: సర్పంచ్ ఎన్నికల తొలి విడత నామినేషన్ల సందర్భంగా సూర్యాపేట మండలం యర్కారం, బాలెంల సహా పలు గ్రామాల్లో పోలీసు పహారా కట్టుదిట్టం చేశారు. ఈరోజు CI రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్ కేంద్రాలను పరిశీలించారు. 100 మీ. నిబంధన తప్పక పాటించాలని సిబ్బందికి వారు సూచించారు. అనంతరం ప్రజలకు ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు.