హన్మకొండ పట్టణంలో ప్రసిద్ధి చెందిన టౌన్‌హాల్ శతవత్సరం పూర్తి చేసుకుంది. 1924లో ఏడో నిజాం మీర్ ఒస్మాన్ ఆలీ ఖాన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ చారిత్రక కట్టడం ఇప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతీకగా నిలిచింది. ‘మహబూబ్ బాగ్’ పేరుతో 7 ఎకరాల్లో నిర్మించిన ఈ గార్డెన్‌కు అప్పట్లో రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు వరంగల్ KUDA అధికారులు తెలిపారు.