SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో ఇవాళ ఉదయం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బైక్పై విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు వార్డుల్లో పారిశుధ్యం, కాలువలు ,త్రాగునీరు ,డ్రైనేజ్ వ్యవస్థ వంటి అంశాలను సమీక్షించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ రవి, మున్సిపల్ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.