GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబు రానున్న ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె, సత్తెనపల్లి నుంచి మూడుసార్లు పోటీ చేసి ఒక్కసారి గెలిచారు. వైసీపీకి సన్నిహితుడైన ఆయన ప్రస్తుతం వైసీపీ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు.