TG: రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 29 వరకు గడువు ఉంది. ఉ.10.30 నుంచి 5 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. తొలిదశలో 4,236 గ్రామాలు, 37,450 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణకు ఛాన్స్ ఉండగా.. డిసెంబర్ 11న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.