SDPT: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి పరిశీలించారు. తొలి విడతలో దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్ పూర్, మర్కూక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లోని 163 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నయి.