TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ అర్వింద్ నిప్పులు చెరిగారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వం ఆడుతున్నదంతా డ్రామా అని కొట్టిపారేశారు. 42 శాతంలో సగం కూడా రిజర్వేషన్ ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేని వారు.. రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ దొంగ నాటకాలు బయటపడ్డాయని తీవ్ర విమర్శలు చేశారు.