ATP: జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్ని అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ పోలీస్ అధికారులకు సూచించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా గురువారం వేకువజామున ఇండ్ల బయట ప్రదేశాలలో ముగ్గులు పెట్టడం, వాకింగ్ లకు వెళ్లే మహిళలలను ఆయా పోలీసులు అప్రమత్తం చేశారు. సంఘటన జరిగితే 100కు కాల్ చేయాలన్నారు.