AP: శ్రీ సత్యసాయి జిల్లా గరికపల్లెలో బాలుడి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. 2 రోజుల క్రితం మిస్ అయిన కొమ్మెర హర్షవర్ధన్(4)ను మేనమామ ప్రసాద్ దారుణంగా హత్య చేశాడు. ఎన్పీ కుంట మండలం జౌకల గ్రామ సమీపంలో హర్షవర్ధన్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. అనుమానంతో ప్రశ్నించగా ప్రసాద్ నేరం అంగీకరించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.