MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఈ సందర్భంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీలకు కేవలం 20.98 శాతమే రిజర్వేషన్లు ఖరారు చేశారు అధికారులు. అన్ని కేటగిరిల్లో కలిపి మహిళలకు 45.83 శాతం రిజర్వేషన్ ఖరారు చేశారు. ఎస్టిలకు 19.01% రిజర్వేషన్లు, ఎస్సీలకు 16.57, జనరల్ కు 43.44 శాతం రిజర్వేషన్లు ఖరారయ్యాయి.