AP: చేపల వేట స్థావరాల కోసం కోనసీమ జిల్లా మత్స్యకారులు పడవల పోటీలకు దిగారు. బలుసుతిప్ప గ్రామంలో జరుగుతున్న ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జాలర్లు వచ్చారు. ఏటా వరదలు తగ్గిన తర్వాత నిర్వహించే ఈ పోటీల్లో గెలిచి వలకట్ల స్థలం దక్కించుకున్నవారికే.. మళ్లీ వరదలు వచ్చే వరకు ఆ స్థలం సొంతం.