SRPT: గ్రామాల్లో యువత కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, NSUI మునగాల మండల అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మునగాల మండల కేంద్రంలో గురువారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో యువత కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు.