ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7 మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7 మండలాల్లోని 191 గ్రామాలు,1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.