VSP: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా గురువారం తొలి పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, వారి సతీమణి పద్మజ దంపతులు అమ్మవారి గర్భాలయంలో పంచామృత అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు.