VZM: పైడితల్లి సిరిమానోత్సవంలో శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణకు కేటాయించిన వేదిక కూలిన ఘటనపై విచారణకు GAD ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా కలెక్టర్‌ను ఆదేశించారు. బొత్స ప్రొటోకాల్, భద్రత లోపంపై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.