NLG: గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నల్లగొండ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలని లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు పోరు సన్నాహాలు మొదలుపెట్టాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నారు.