తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ‘జైలర్ 2’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలో సేతుపతికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. కాగా, గతంలో రజినీ, విజయ్ కాంబోలో ‘పేట’ మూవీ వచ్చింది.