VSP: పీ.ఎం.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆమెను క్షేమంగా గుర్తించి బుధవారం కుటుంబ సభ్యులకి అప్పగించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి పి.యం.పాలెం పోలీసులను అఅభినందించారు.