MBNR: బోయపల్లి రైస్ మిల్లు సమీపంలో బుధవారం సాయంత్రం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఆంజనేయులు (40) అనే వ్యక్తికి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది తక్షణమే ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.