MBNR: బాలానగర్ మండల కేంద్రంలో గతంలో ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు సర్వే నిర్వహించిన అధికారులు, ఆ భూమిలో హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచిక బోర్డులో రాశారు.