కృష్ణా: గన్నవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి సావరగూడెం శివారులో ఎదురెదురుగా దూసుకొచ్చిన రెండు కార్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గన్నవరం నుంచి విజయవాడ దిశగా ప్రయాణిస్తున్న కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.