PPM: కొమరాడ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగ వ్యవహరంలో ఇప్పటికే నలుగు పంచాయతీ కార్యదర్శులపై వేటు పడింది. తాజాగా సర్పంచి చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఎంపీడీవో కార్యాలయానికి జిల్లా కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంటి పన్ను వసూలు అక్రమాలతో పాటు, 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం చేశారని కొంత మంది ఫిర్యాదు చేశారు.