ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.