SKLM: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిధి అధ్యాపక పోస్టులకు ఈనెల 28 లోగా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెట్, నెట్ అర్హత సాధించిన వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. పీజీలో తప్పనిసరిగా 55% మార్కులు కలిగి ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.