VSP: పీఎం పాలెంలో బుధవారం విషం తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కూతురు పెళ్లి అర్థాంతరంగా ఆగిపోవడమే ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. పీఎంపాలెంకు చెందిన ర్యాలీ శ్రీనివాసరావు (54) HYDలో ఉంటున్నారు. ఇటీవల కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు రావడంతో యువకుడి తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేసుకున్నారు.