W.G: నరసాపురం పురపాలక సంఘ సాధారణ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ బర్రె శ్రీవెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు సకాలంలో హాజరుకావాలని ఆమె కోరారు.