కోనసీమ: రాజమహేంద్రవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో అమలాపురానికి చెందిన విద్యార్థిని పామర్తి మాధురి ఇందుప్రియ మెరిసింది. అండర్-14 విభాగంలో పోటీపడి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని కోచ్ పడాల అంజి గురువారం తెలిపారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఇందుప్రియను కోచ్‌తో పాట పలువురు అభినందించారు.