NLR: జిల్లాలో రబీ సీజన్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సాయంలో భాగంగా, ఏడాదికి మూడు విడతల్లో రూ. 20వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండో విడతతో కలిపి రైతుల ఖాతాల్లో రూ. 14వేలు జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1.95 లక్షల మంది రైతులకు 130 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి.