VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక కళాశాలలో జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడి చేసినట్లు సమాచారం. బుధవారం తరగతులు జరుగుతుండగా, సీనియర్లు ఆ విద్యార్థిని తరగతి గది నుంచి బయటకు పిలిచి, క్లాస్ పూర్తయ్యాక బయటకు వెళ్తుండగా దాడికి పాల్పడ్డారు. పిలిస్తే ఎందుకు రాలేదని వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.