ములుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ఎన్నికలకు నేడు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని మూడు మండలాల్లో మొదటి విడత ఎన్నికలు నిర్వహించారు. గోవిందరావుపేట 18 జీపీలు, తాడ్వాయి 18 జీపీలు, ఏటూరునాగారం 12 జీపీలు, మొత్తం 48 సర్పంచ్, 420 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.