ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత నామినేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.తొలి విడతలో భాగంలో 23 మండలాల్లోని 555 గ్రామ పంచాయతీలకు, 4952 వార్డులకు నామినేషన్లు వేయనున్నాను. అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయడానికి 171 కేంద్రాలను జిల్లాలోని ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు 15, హనుమకొండ 24, వరంగల్ 29, జనగామ 30, భూపాలపల్లి 24, మహబూబాబాద్‌లో 49 కేంద్రాలు ఏర్పరిచారు.