NGKL: జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, వంగూరు, తెలకపల్లి, తాడూరు మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు.